లక్ష్మీదేవి గూడెం ఎరుకలగుట్ట
అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం
పాఠశాల క్రీడల్లో పాల్గొన్న సర్పంచ్ ఎలికట్టి భరత్
మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు సొంతింటి కల నెరవేరుతుందని లక్ష్మీదేవిగూడెం గ్రామ సర్పంచ్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిగూడెం, ఎరుకలగుట్ట గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, మహిళల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రతి అర్హులైన కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి విద్య ప్రాముఖ్యతను వివరించారు. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడా కార్యక్రమాల్లో సర్పంచ్ ఎలికట్టి భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కళ్యాణి ,పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.


