Breaking News

పంచాయతీ కార్యదర్శి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి.

ఉప సర్పంచ్ జరుపుల రమేష్

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

మండలంలోని అరవయాపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి అఖిలపై ఉన్నత అధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచ్ జరుపుల రమేష్ అన్నారు. విలేకరుల సమావేశంలో అతను మాట్లాడుతూ 2014 గ్రామ శివారులో బోరుబావి తవ్వించి చేతిపంపును బిగించగా కొందరు ప్రైవేటు వ్యక్తులు నీటిని వాడుకుంటున్నారని విషయమై పంచాయతీ కార్యదర్శులు మండల అభివృద్ధి అధికారి ఫిర్యాదు చేయగా విచారణ చేసిన అధికారులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసే విద్యుత్ మోటార్ ను తొలగించాలని ఆదేశించినట్లు ఉప సర్పంచ్ రమేష్ తెలిపారు. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.