Breaking News

వైభవంగా లక్ష గాయత్రి మహా యజ్ఞం

-పట్టణ వీధులలో మారు మోగిన ఓం బూర్బూత్సవ

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో జరుగుచున్న శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు లక్ష గాయత్రి మహా యజ్ఞం వైభవంగా నిర్వహింపబడింది . పట్టణ వీధులు ఓం బూ ర్బూత్సవ గాయత్రి మంత్రం మారు మ్రోగింది. అనంతరం ఆలయ కమిటీ వారిచే శ్రీ చక్ర పూజ చేయబడింది. శ్రీ శంకర మహిళా మండలి వారిచ్చే భ్రమరాంబ దేవి సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. స్థానిక పట్టు చీరల ఉత్పత్తిదారుల సంఘం వారిచే శివ పంచాయతన యజ్ఞం శ్రీ భద్రావతి భావన ఋషి అష్టోత్తర శ తనామావళి పూజ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాల్లో దేవాలయ చైర్మన్ సత్య నారాయణ ,పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర పాండురం గ శాస్త్రి తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ భజన మండల వారు, య జ్ఞకర్తలు, భక్తజనులు పాల్గొన్నారు.