Breaking News

మద్ది మేడారం గద్దె పైకి చేరిన సమ్మక్క

భక్తులతో నిండిపోయిన ఆలయ ప్రాంగణం

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

మండలంలోని మద్ది మేడారం గద్దెపై సమ్మక్క కొలువు తీరింది. డప్పు వాయిద్యాల మధ్య ,శివసత్తుల పూనకాలతో ఆలయ పూజారి దురిశెట్టి నాగరాజు వారి కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో సమ్మక్కను గద్దెపైకి తీసుకొని వచ్చారు. సమ్మక్క రాక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. గద్దెల ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. స్థానిక ఎస్సై గోవర్ధన్ భక్తులకు ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బందిని కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఆలయ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది జాతర చుట్టూ పరిసరాల ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రతగా ఉండేలా చూసుకున్నారు. ఈ జాతరలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ పబ్బు రాజేష్, ఎమ్మార్వో ముప్పు కృష్ణ, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆలయ ఏవో, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు