మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలిపారు.నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ముద్రగడ విశిష్ట సేవలు అందించారని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

