బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

అనారోగ్యం భరించలేక యువకుడి బలవన్మరణం

ఆస్తమా, ఛాతీ నొప్పితో మనస్తాపం.. ఇంట్లో ఉరివేసుకున్న హేమంత్ (అజయ్)

18 రోజుల క్రితమే బాబు జననం.. అంతలోనే తండ్రి మృతి

మనప్రగతి న్యూస్ / వేములవాడ ప్రతినిధి:

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రాజన్నా సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పట్టణ సీఐ వీర ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయినగర్‌కు చెందిన బాలసాని హేమంత్ (అజయ్) (24) గత నాలుగేళ్లుగా ఆస్తమా, తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన అతడు బుధవారం తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిసింది.మృతుడికి 18 రోజుల క్రితమే బాబు జన్మించడంతో కుటుంబంలో ఆనందం నెలకొనగా, ఇంతలోనే హేమంత్ మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.మృతుడి తండ్రి బాలసాని మల్లేశం గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా వైద్య నిపుణులను సంప్రదించి సకాలంలో సహాయం పొందాలని సూచించారు.