బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

పార్టీ కోసం శ్రమించిన వారికే గుర్తింపు,పదవులు – బూత్ స్థాయి నుంచే బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

పార్టీ కోసం కష్టకాలంలో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు, బాధ్యతలు లభిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం టూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లతో తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత బలోపేతం, ఎస్‌ఐఆర్ కార్యక్రమం, బూత్ స్థాయి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని పేర్కొన్న ఆయన, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ప్రతి బూత్ ఏజెంట్ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.పార్టీ కష్టసమయంలో జెండా మోసిన కార్యకర్తల సేవలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.ప్రస్తుతం పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని, బూత్ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేసేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి బూత్‌లో ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఎస్‌ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదును ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి ప్రతి కుటుంబాన్ని పార్టీతో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు, విద్యార్థులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.కార్యకర్తల మధ్య ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణే పార్టీ విజయానికి బలమని పేర్కొన్న పువ్వాడ అజయ్ కుమార్, ప్రతి కార్యకర్త పార్టీ విజయమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్