బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అయోమయంలో మహిళా సంఘాలు

అయోమయంలో మహిళా సంఘాలు

నర్సరీ బిల్లులు రాక అవస్థలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళలకు అన్ని విధాల చేయూతనిస్తూ మహిళ సంఘాలను అభివృద్ధి చేసి , మహిళలను సంపన్నులుగా మార్చాలనే లక్ష్యంతో సంఘాలకు కేటాయించిన నర్సరీలలో అన్ని రకాల మొక్కలను పెంచే విధంగా సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు చెల్లించటానికి మీన వేషాలు వేస్తుందని , మహిళ సంఘాలు, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి , తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మహిళా సంఘాల సభ్యులందరిని కష్టాలపాలు చేసిందని 2022-23 ఎస్ ఎచ్ జీ మహిళ సంఘాలైన విజయ లక్ష్మి సమభావన సంఘంకు 4,79,000 లక్షల రూపాయలు కేటాయించగా , 2023-2024 సంవత్సరంలో ప్రగతి లక్ష్మి సమభావన సంఘానికి 4,00,000 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో పనులు ప్రారంభించి ఎరువును కలిపిన ఎర్ర మట్టిని ప్లాస్టిక్ సంచులలో కూలీలతో నింపి మొక్కలు నాటి మున్సిపాలిటీకి అందజేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మహిళా సంఘాలు అప్పు చేసి ఖర్చు చేసిన బిల్లులు రాకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నారు .నందికొండ మున్సిపాలిటీ ,కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి మహిళలు తమ గోడు విన్నవించుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. మహిళ సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న ప్రభుత్వాలు , వాళ్లని కోటీశ్వరులు చేయకున్నా పర్వాలేదు కానీ వాళ్లు అప్పుల పాలు కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా మున్సిపాలిటీలో మహిళ సంఘాలు చేసిన నర్సరీ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తే చాలని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నర్శరీ పాత బకాయిలు చెల్లించిన తరువాతనే నందికొండ మున్సిపాలిటీలో క్రొత్త నర్సరీ పనులు ప్రారంభించాలని మహిళా సంఘాలు సంబంధిత అధికారులను కోరుతున్నాయి.