బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్‌:

తెలంగాణ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ కు ఏకంగా రూ.1 కోటి జరిమానా విధించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించారు.

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ పిటిషనర్‌కు కోటి రూపాయల జరిమానా విధించారు.

హైకోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఆ విషయాన్ని దాచిన పిటిషనర్ వేరే బెంచ్‌ వద్ద పిటిషన్‌ వేసి ఆర్డర్‌ తీసుకున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

దీనిపై హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై ఆయన సీరియస్‌ అయ్యారు.

అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలని పిటిషనర్ యత్నించినట్లు గుర్తించారు.

కోర్టులను మభ్యపెట్టాలని ప్రయత్నించడం, కోర్టుల సమయాన్ని వృథా చేయడంతో పాటు తప్పుదోవ పట్టించేయత్నం చేసినందుకు పిటిషనర్ కు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.

అత్యంత భారీ జరిమానా విధిస్తూ తీర్పు రావడం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది.