మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
పట్టణంలోని గంగపుత్ర సంఘం వీధిలో మహిళలు కోలాటం గా,కొలహాలంగా సంతోషంతో బొడ్డెమ్మ వేడుకలను ప్రారంభించారు. బొడ్డెమ్మను పుట్ట మట్టితో చెక్క పీటపై అందంగా చతురస్రాకారంగా 5 దొంతరులుగా ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంలో పేర్చి ఉద్రాక్ష, కాకర,కట్ల,మల్లీ,జాజి పూలతో అలంకరించారు. ఆ తర్వాత శిఖర ప్రదేశాన బియ్యంతో కూడిన చిన్న కలశం కొత్త వస్త్రం పెట్టారు. తమలపాకు పసుపులతో బొడ్డెమ్మను పేర్చి ఉంచి బొడ్డెమ్మ పాటలు పాడుతూ ఆనందంగా బొడ్డేమ్మ మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ మున్సిపాలిటీ మాజి చైర్పర్సన్ గుంటి రజని కిషన్ మాట్లాడుతూ భాద్రపద బహుళ పంచమి రోజు బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని, బొడ్డెమ్మంటే దాన్య రాశి ధాన్యపు, రాశి కుప్పని అంటారని అన్నారు.
కన్నెపిల్లలు ప్రత్యేకంగా పాల్గొని పూజలు చేస్తారని వారికి మంచి భర్త దొరకాలని కోరుకుంటారన్నారు. బతుకమ్మ పాటల మాదిరిగా బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో బిడ్డలు ఎందరు వలలో అంటూ ప్రత్యేకమైన పాటలు పాడుతూ తొమ్మిది రోజులపాటు పూజలు చేస్తారని తెలిపారు. బొడ్డెమ్మ ను అమావాస్యకు ముందు రోజు తొమ్మిది రోజులు పాటు ఆటపాటలు అనంతరం బొడ్డెమ్మను అలంకరించి చెంబులో పోసిన దాన్యం,పప్పు,బెల్లం నైవేద్యంగా తయారుచేసి అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఆ తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారని అన్నారు. మహాలయ అమావాస్య వరకు అంటే బతుకమ్మ తొలి నాటి వరకు జరుపుకొని నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర మహిళా మత్స్య పారిశ్రామిక అధ్యక్షురాలు గుంటి రమ,డైరెక్టర్ లు చింతల రేఖ,మేదర బోయిన శైలజ, తుంగతుర్తి సునీత, భయ్యా స్వర్ణ,నాతి లక్ష్మి,నాతి రుద్ర, జూలూరు అమూల్య పెద్దలు పిల్లలు అందరూ పాల్గొన్నారు.

