Breaking News

పంటల సాగుకు సరిపడా యూరియా నిలువలు

_ రైతులు ఆందోళన చెందవద్దు..

_ జిల్లాలో ఎరువుల కొరత లేదు..

_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్..

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మన ప్రగతి న్యూస్ /
సిరిసిల్ల జిల్లా స్టాపర్

జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా.. ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందని సూచించారు. కనీస సదుపాయాలు కల్పించాలని తెలిపారు.జిల్లాలో యాసంగి సాగు కోసం మొత్తం 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి దాకా 10 వేల 991 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని వెల్లడించారు. మిగతా కావాల్సిన ఎరువులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.ప్రైవేట్ డీలర్లు 223, పీసీసీఎస్ షాపులు 54, డీసీఎంఎస్ 16, ఏఆర్ ఎస్ కే 13 ఎరువుల షాపులు ఉన్నాయని వెల్లడించారు. అన్ని షాప్ లలో రోజూ ఉదయం ఆరు గంటల నుంచి విక్రయాలు మొదలు పెట్టాలని, ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.