- ఇద్దరు నిందితులు అరెస్టు..
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, వడ్లగూడెం గ్రామంలో ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ కు అక్రమంగా గోదావరి ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీని దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఆదివారం సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రంలోని అరికరేవుల ఇసుక రీచ్ కొవ్వూరు నుండి తెలంగాణ మీదుగా ఇసుక లోడుతో వస్తున్న బెంజ్ లారీని తనిఖీల్లో భాగంగా వడ్లగూడెం ఊరి బయట లారీని ఆపి లారీ డ్రైవర్ తామర్చి ప్రభాకర్ ను సరైన పత్రాలు చూపించమనగా లేవని తెలపడంతో డ్రైవర్ ను ఇసుకను అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న నిందితురాలు గంట సీతామహాలక్ష్మిని అదుపులోకి తీసుకొని లారీని స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

