- ఎమ్మెల్యే రేవూరి..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసన సభ్యు లు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమ వారం నడికూడ మండల కేంద్రంలో నిర్మి స్తున్న పాల శీతలీకరణ కేంద్రం (బిఎంసి) భవనమునకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తో కలిసి ఎమ్మెల్యే రేవూరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం, మహిళల కోసం మహిళ లతో ఏర్పడింది ఈ పరకాల ఇందిరా మహిళా డైరీ అని అన్నారు. ప్రభుత్వ సహకారంతో అధికారుల కృషితో, రాజ కీయాలకు అతీతంగా పరకాల డైరీనీ అభివృద్ధి చేసుకుందామని, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంక ల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘా లు ఆర్థికంగా బలపడాలంటే పాడి పరిశ్ర మలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇది కేవలం ఒక ఆర్థికపరమైన వ్యాపారం మాత్రమే కాదు.. ప్రజల జీవితాల్లో వెలు గు నింపే మహా యజ్ఞం అని, ఈ యజ్ఞం లో పరకాల నియోజకవర్గ ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో డా. లక్ష్మీనారాయ ణ,తహాసిల్దార్ రాణి, పరకాల, నడికూడ మండలాల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, బుర్ర దేవేందర్ గౌడ్, ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పర్నెం మల్లారెడ్డి, దురిశెట్టి చంద్రమౌళి, ఉపసర్పంచ్ తరిగొప్పుల సంపత్,సంబం ధిత అధికారులు, తదితరులు పాల్గొన్నా రు.

