Breaking News

భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపిన కసాయి భర్త..

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ :

సిద్దిపేట మండలం దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన శివరాత్రి కనక పోచయ్య కూతురు దున్నపోతుల శ్రీలత భర్త ఎల్లయ్య కు 18 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగినది మరియు వారికి ఒక కూతురు, ఒక కొడుకు. గత సంవత్సరం నుండి వారి అల్లుడు ఎల్లయ్య తన బిడ్డ శ్రీలతపై అనుమానం పెంచుకొని ప్రతిరోజు బిడ్డను మానసికంగా శారీరకంగా వేధింపులు చేయుచున్నాడని , పలుమార్లుమందలించినప్పటికీ మా మనవడు మనవరాలు ఇద్దరు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. నెలరోజుల క్రితం వాళ్ళు ఇంటికి రాగా నేను మా కుల పెద్ద మనుషుల చేత కూడా మా అల్లుడికి నచ్చా చెప్పించాను, అప్పుడు మా అల్లుడు ఇక మీదట ఎటువంటి అనుమానం పెట్టుకోను మంచిగా చూసుకుంటానని చెప్పి బ్రతకడానికి హైదరాబాద్ పోతామని చెప్పి నా బిడ్డను తీసుకొని హైదరాబాదుకు, తిసుకుపోయినాడు. పది రోజుల క్రితం మళ్లీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శ నగర్ లో కిరాయి ఉంటున్నారు . సోమవారం తెల్లవారుజామున నా మనవడు నాకు ఫోన్ చేసి మా అల్లుడు నా బిడ్డ శ్రీలతను గొంతు కోసి,
చంపినాడని ,మనవరాలు హర్షితను కూడా మెడ కోసి నాడని తర్వాత అల్లుడు కూడా గొంతు కోసుకున్నాడని హాస్పిటల్ తీసుకుపోతున్నాను అని చెప్పగా వెంటనే నేను నా భార్య సిద్దిపేటకు వచ్చి చూడగా నా బిడ్డ శ్రీలత ఇంటి మద్య గదిలో నేలపై పరుపు మీద రక్తపు మడుగులో చనిపోయి ఉన్నది నా మనవరాలు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది, ఆమెకు సీరియస్ గా ఉండగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు నా బంధువులు తీసుకుపోయి అపోలో హాస్పటల్లో చేర్పించినారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఫిర్యాదు .మృతుని తండ్రి కనక పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడమైనది.
నిందితుడు ఎల్లయ్యను ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాలు అనుమానమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు