మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు :
ఆమనగల్లు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ ఆమనగల్లు పట్టణానికి చెందిన అడ్వకేట్ వస్పుల మల్లేష్ హైకోర్టు ను ఆశ్రయించారు.మున్సిపాలిటీ లో ఉన్న 15 వార్డుల్లో మరణించిన వారి పేర్లను తొలగించకపోగా, ఒకే వార్డులో ఒకే వ్యక్తికి రెండు ఓట్లను కలిగి ఉండటం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దీంతో ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికలకు స్టే విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జాబితాను వెంటనే సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై వాదనల అనంతరం ఫిబ్రవరి 9 వరకు ఓటరు జాబితాను సవరించాలని అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను వెంటనే ఆపేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

