Breaking News

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

-హుజురాబాద్ ఏసిపి మాధవి.

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

ప్రజల భద్రత,నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని హుజురాబాద్ ఏసిపి మాధవి అన్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ పూదారి రాజు,గ్రామస్తులందరూ కలిసి గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ ఏసిపి మాధవి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులో వస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నేరాలను నియంత్రించేందుకు, అసాంఘిక కార్యక్రమాలకు, అనుమానస్పద కదలికలను గుర్తించడంలో నేరస్తులను పట్టుకునే విషయంలో పోలీస్ శాఖకు ఎంతో సహకారం లభిస్తుందన్నారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో భద్రత మరింత పెరిగిందని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.మండల పరిధిలోని 27 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులలో ఆదర్శవంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్ పూదరి రాజును,ఉపసర్పంచ్ దండు రాజేష్ లకు పోలీసు శాఖ తరపున శాలువాతో సన్మానించి,అభినందనలు తెలిపారు.ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ పులి వెంకట్,ఎస్సై శేఖర్ రెడ్డి,గ్రామ పెద్దలు,మాజీ ప్రజా ప్రతినిధులు,యువత పాల్గొన్నారు.