Breaking News

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్ లో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.94 లక్షల వడ్డీ రాయితీ రుణాల చెక్కులను ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి,మెప్మా పీడీ వెంకట నారాయణ, మున్సిపల్ కమీషనర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహిళలందరూ మా ఆడబిడ్డలేనని,కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు గుర్తు చేశారు.ఆడబిడ్డలకు చీర సారే ఇచ్చి గౌరవించడం సంప్రదాయమన్నారు. మహి ళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు,పెట్రోల్‌ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, సోలార్‌ ప్లాంట్లు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాళ్ళ రవీందర్, వస్పుల శ్రీశైలం,జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం కేశవులు, అప్పం శ్రీను,కృష్ణ నాయక్,మండలం అధ్యక్షులు జగన్, మున్సిపల్ అధ్యక్షులు వస్పుల మానయ్య,నాయకులు మెకానిక్ బాబా,ఎంగళి ప్రసాద్,మహేష్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.