-సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి.
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేశవపట్నం సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి హెచ్చరించారు.శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు,రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు.ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాజకీయ,కుల,మత,ప్రాంతీయ వివాదాలకు తావు ఇచ్చేలా వ్యవహరించకూడదన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు,వీడియోలు,ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.వాట్సాప్,ఫేస్‌బుక్,ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించవద్దన్నారు.ఏ వర్గాన్ని కించపరిచేలా తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం,షేర్ చేయడం నేరంగా పరిగణించబడుతుందాన్నారు.గ్రూపు లలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే,ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణించబడతాన్నారు.ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ వుంటుందని తెలిపారు.అనుచిత పోస్ట్‌లను,ఫార్వర్డ్ చేసిన వారిపైనా కేసులు నమోదు చేయబడతాయని,సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేకూర్చే విధంగా ఉండాలన్నారు.నిబంధనలను అతిక్రమించే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

