Breaking News

బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మూల దశరథం మదాసు జగన్ ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ పరికరాల కొరకై కేశవపట్నం వెళ్లారు.తిరుగు ప్రయాణంలో తాడికల్ గ్రామ శివారులో నాగార్జునసాగర్ మండలం అల్వాల్ గ్రామానికి చెందిన రెడ్డిమల్ల నరసయ్య,రెడ్డిమల్ల వెంకన్న బాటసారులను ఢీ కొట్టారు.ఈ ఘటనలో బైక్ పై ఉన్న దశరథం,బాటసారి నరసయ్య ఇరువురి తల లకు గాయాలయ్యాయి.వాహనదారులు 108కి,పోలీసులకి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ ఖలీల్ ప్రధమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది వివరాలు నమోదు చేసుకున్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు