శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం
మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :
వాసవి క్లబ్ వనిత ఆనందగిరి నిజాంపేట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా సామూహిక సహస్ర కుంకుమార్చన అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం స్థానిక నిజాంపేట్ తిరు సంకల్పం కమ్యూనిటీ హాల్ నందు క్లబ్ జోనల్ చర్ పర్సన్ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి (రాధ) నిర్వహించడం జరిగింది అనంతరం క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. క్లబ్ నూతన అధ్యక్షురాలుగా టి.విజయలక్ష్మి, జనరల్ సెక్రెటరీగా బి. సంధ్యారాణి, ట్రెజరర్ గా ఎం.పద్మ మరియు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఇరుకుల ప్రదీప్ కుమార్, క్లబ్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కమిటీ అతిథులుగా పాల్గొనడం జరిగింది…

