Breaking News

సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి..

_ రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్..

మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల :

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.ఖరీఫ్ సీజన్ 2024–25కు సంబంధించి సీఎంఆర్ డెలివరీకి చివరి తేదీ 16-02-2026, రబీ సీజన్ 2024–25కు సంబంధించిన డెలివరీకి చివరి తేదీ 28-02-2026గా నిర్ణయించినట్లు తెలిపారు.
సీఎంఆర్ లక్ష్యంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని రైస్ మిల్లర్లందరూ వారికి కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్ అందజేయాలని ఆదేశించారు.అనంతరం జిల్లాలోని మిల్లుల వారిగా ఇచ్చిన లక్ష్యం వారు పూర్తి చేసిన ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వడంలో వెనుకబడిన మిల్లులను గుర్తించి వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆయా మిల్లులను తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు. రైస్ మిల్లర్లు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని రైస్ మిల్ యజమానులందరూ సమన్వయంతో ప్రభుత్వం అందించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని వివరించారు. 
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్, డీఎం రజిత, రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.