Breaking News

గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఇంటి ఆవరణలోని దొడ్డిలో ఉన్న గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధిత కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.ఆడితం చిన్న పోశాలకు చెందిన రెండు గొర్రెలను దొడ్డిలో నుండి దొంగలు రాత్రి అపహరించారు.రెండు గొర్రెల విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.పోశాలు కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా