Breaking News

హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి : ఎస్ఐ కే.క్రాంతికిరణ్

•అలైవ్ అరైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు,కేసముద్రం ఎస్ఐ కే.క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పూలే సెంటర్‌లో అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అలైవ్ అరైవ్ కార్యక్రమంపై కేసముద్రం పోలీసులు రూపొందించిన ఆటో స్టిక్కర్లను ఎస్ఐ కే. క్రాంతికిరణ్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదని, పరిమితికి మించి వేగంతో వాహనాలు నడపవద్దని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే అలైవ్ అరైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్తా జర్నలిస్టు ఎసళ్ల సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.