-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా స్థాపర్)
ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలసి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు కవాతు మైదానంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్టేజీ, పార్కింగ్,విద్యుత్,అలంకరణ,సౌండ్ తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.విద్యుత్,ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో వేడుకలకు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.108, 102, బాల రక్షక్, సఖి వాహనాలను ప్రదర్శనలో ఉంచాలన్నారు.ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు ఉత్తమ సేవలు అందించిన సిబ్బంది పేర్లను పరిశీలించి నివేదికలు పంపాలని సూచించారు.పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ కవాతు మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని అన్నారు.పోలీస్ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే,లక్ష్మీ కిరణ్,మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,ఆర్డీవో మహేశ్వర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


