మన ప్రగతి న్యూస్/ వేములవాడ
జిల్లాలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సెక్రెటరీ ఇలంబర్తి తెలిపారు. సిరిసిల్ల ఐడీఓసీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ పాల్గొన్నారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో గోశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి, తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. గోశాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.గోశాల నిర్మాణంతో గోవుల సంరక్షణతో పాటు రైతులకు కూడా మేలు చేకూరుతుందని అధికారులు పేర్కొన్నారు

