మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారంవిజయవంతంగా ప్రారంభమైంది. పట్టణంలోని వివిధ వార్డుల్లో అధికారులు చీరల పంపిణీ చేపట్టగా, మహిళల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. నాలుగో వార్డుకు చెందిన దేవునిపల్లి గ్రామంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి గ్రామంలోని ఆడపడుచులు అందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమం పట్ల గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ చీర చేతికొచ్చిన వేళ వారి ముఖాల్లో ఆనందం, కళ్లలో కృతజ్ఞత స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వరకు చేరాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు, నాయకులు తెలిపారు.

