Breaking News

హాజీపూర్ తండాలో జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధికి రూ.25 వేల విరాళం

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలో ఉన్న జగదాంబ, సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధి కోసం అదే తండాకు చెందిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ (లడ్డు) కలిసి రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బంజారా సమాజ ఆరాధ్య దైవాలైన జగదాంబ, సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులో కూడా గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కోలారాములు నాయక్, జనరల్ సెక్రటరీ సభావాట్ సర్దార్ నాయక్, మాజీ జనరల్ సెక్రటరీ గోవింద్ నాయక్, తాండ జగదాంబ గుడి మహారాజ్, తాండ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొని దాతలను అభినందించారు. గుడి అభివృద్ధికి విరాళం అందించిన నాయకులకు తాండవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు