Breaking News

మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా!

-సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి.

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని,వాహనాదారులు జాగ్రత్తగా ఉండాలని కేశవపట్నం సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు.శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో తనిఖీలు చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 13మందిని మంగళవారం హుజురాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.13 మంది మందుబాబులకు స్పెషల్ జ్యుడిషినల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య రూ.33వేలు జరిమాన విధించినట్లు శేఖర్ రెడ్డి తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు,ఉపాధి అవకాశాలు పోలీస్‌ వెరిఫికేషన్‌ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.ట్రాఫిక్‌,రోడ్డు భద్రత నియమనిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శేఖర్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు.