Breaking News

పోటీ చేయగానే అయిపోలె..లెక్కలు పక్కాగా చెప్పాల్సిందే!

-ఎంపీడీవో కృష్ణ ప్రసాద్.

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

శంకరపట్నం మండలంలో 27 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును ఈనెల 24వ తేదీ వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలియజేసి రశీదు తీసుకోవాలని ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.లేదంటే వేటు పడే ప్రమాదం ఉందని,అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు సమర్పించాలి.లెక్కలు సమర్పించకుంటే ఎన్నికల సంఘం పంచాయతీ రాజ్ చట్టం- 2018 ప్రకారం అభ్యర్థులపై మూడేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో గెలిచి,నిర్ణీత సమయంలోగా వివరాలు ఇవ్వకుంటే పదవి కోల్పోయినట్లు ప్రకటిస్తుందాన్నారు.