_ గ్రామ సర్పంచ్ బొమ్మెన ఆంజనేయులు
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
ముస్తాబాద్ మండల చీకోడు గ్రామంలోని క్రీడాకారుల యువతకు గ్రామ సర్పంచ్ బొమ్మెన ఆంజనేయులు , సోమవారం నాడు గ్రామంలోని క్రికెట్ ఆడే యువతకు ఇచ్చిన హామీ ప్రకారం 20వ తేదీ మంగళవారం నాడు 2 క్రికెట్ బ్యాట్లు,6వికెట్స్ (స్టంప్స్),2 టెన్నిస్ బాల్స్ 7000 రూ విలువ చేసే క్రికెట్ మెటీరియల్ అందజేశామని తెలిపారు, ఈ సందర్భంగా వారు తెలుపుతూ అలాగే భవిష్యత్ లో క్రీడాపరంగా వివిధ రంగాల్లో యువతకు తనవంతు ప్రోత్సాహం అందించడానికి ముందువరుసలో ఉంటానని గ్రామ సర్పంచ్ బొమ్మెనఆంజనేయులు భరోసా ఇచ్చారు,ఈ సందర్భంగా క్రీడ యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, అనంతరం గ్రామ యువత గ్రామ సర్పంచ్ నీ శాలువతో సన్మానం చేశారు,

