Breaking News

చట్టబద్ధంగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ కేటాయింపు.

స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ .

మన ప్రగతి న్యూస్ /మిర్యాలగూడ.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

మిర్యాలగూడ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం కేటాయింపుపై తలెత్తిన వివాదంపై అమిత్ నారాయణ స్పందించారు.
ప్రభుత్వ నిబంధనలు, జీవో ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనం కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌పీ భవనాన్ని సబ్ రిజిస్ట్రేషన్ శాఖకు కేటాయించామని తెలిపారు.
భవనాన్ని స్వాధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌కు అధికారిక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే అపోహలు నెలకొన్నాయని, దీనిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో ఎటువంటి రాజకీయ లేదా వ్యక్తిగత జోక్యం ఉండదని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు సేవలందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అనవసర వివాదాలకు తావులేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ స్పష్టం చేశారు.