Breaking News

కుషాయిగూడలో అక్రమ స్పా సెంటర్‌పై పోలీసుల దాడి

మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ, ప్లాట్ నెం.2లో ఎలాంటి లైసెన్స్ లేదా ప్రభుత్వ అనుమతులు లేకుండా “స్టైలిష్ స్పా అండ్ సలూన్” పేరిట అక్రమంగా స్పా సెంటర్ నడుస్తున్నారని సమాచారం అందింది. సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకన్న ఆధ్వర్యంలో మహిళా సిబ్బందితో కూడిన పోలీస్ బృందం సాయంత్రం 7 గంటలకు స్థానానికి చేరుకొని దాడి నిర్వహించింది. ఈ దాడిలో రిసెప్షనిస్ట్ మరియు థెరపిస్టులను అదుపులోకి తీసుకున్నారు. స్పా యజమాని నాగేంద్ర (సికిందరాబాద్) ఇప్పటివరకు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో పరిశీలనలు కొనసాగుతున్నాయి. ఈ కేసు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, అక్రమంగా నిర్వహిస్తున్న వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజా భద్రతను కాపాడడం, స్థానిక నియమాల అమలు కట్టుదిట్టం చేయడం ముఖ్యమని వారు గుర్తించారు. అదనంగా, సిబ్బందిని, స్పా కార్యకలాపాలను పరిశీలిస్తూ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు