- లబ్ధిదారుల చుట్టూ దళారుల ప్రదక్షిణలు
- కిలోకు 20 నుంచి 25 వరకు ధర
- ఆటోల్లో పల్లెలు, పట్టణాల్లో సంచారం
- నిఘా పెంచకుంటే మళ్లీ అక్రమ రవాణా
మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి :
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు.గతంలో దొడ్డు బియ్యం చాలామంది వినియోగించుకోకుండా అమ్ముకోవడం, చేయడం వంటి అక్రమాలు జరిగేవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేపట్టింది.సన్న బియ్యం పంపిణీ చేసిన అక్రమాలు యథావిధిగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఇంటింటికి తిరుగుతూ..
సన్న బియ్యం పంపిణీ పూర్తికావడంతో దళారులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం కిలో రూ 8 నుంచి రూ 10 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం సన్నబియ్యం రూ 18 నుంచి రూ 20 వరకు చెల్లించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. లబ్ధిదారులతో వ్యాపారులు బేరసారాలు ఆడుతూ కొనుగోల్లు సాగిసున్నారు. సన్న బియ్యం అమ్మకాలపై నిఘా పెట్టి దళారులను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకుంటున్న అక్రమ దందా మాత్రం ఆపలేకపోతున్నారు.బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం రూ 40 నుంచి రూ 50 వరకు ధర పలుకుతోంది. రేషన్ బియ్యం కొనుగోలు అక్రమార్కులకు లాభదాయకంగా మారిందని చెప్పుకుంటున్నారు.
నిఘా పెంచితేనే అడ్డుకట్ట…
గతంలో దొడ్డుబియ్యం రవాణాను అడ్డుకునేందుకు అటు పోలీసులు, ఇటు పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంటు బృందాలు, విజిలెన్స్ వేర్వేరుగా తనిఖీ లు చేపట్టేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తుండటంతో వీటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందనే ఉద్దేశంతో ఈ బృందాలు రిలాక్స్ అయ్యాయి. తిరిగి అక్రమ దందా జోరందుకుంటున్న నేపథ్యంలో సంబంధిత విభాగాలు నిఘా పెంచాలి. అలాగే తనిఖీలు చేపడితేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

