_ నో హెల్మెట్ – నో పెట్రోల్
_ ముస్తాబాద్ ఎస్ఐ. సిహెచ్ గణేష్
మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్:
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరేయ్ ఆలివ్ ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా లో నో హెల్మెట్- నో పెట్రోల్ నిబంధనను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు..ఈ నేపథ్యంలో ముస్తాబాద్ ఎస్ఐ పెట్రోల్ బంక్ యజమానులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి.. హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయరాదని అవగాహన కల్పించారు, ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నో హెల్మెట్ – నో పెట్రోల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తోందని, తెలిపారు,ముఖ్యంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించా లని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

