మన ప్రగతి న్యూస్/షాబాద్ ప్రతినిధి
షాబాద్ మండల్ పెద్దవేడు గ్రామంలో అమెజాన్ కంపెనీ వారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో అంగన్‌వాడీ భవనం, ప్రీ–ప్రైమరీ స్కూల్ భవనం, ఓపెన్ జిమ్, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తం అని చెప్పడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సర్పంచ్ చక్కటి రాజా సులోచన,(దేవేందర్ రెడ్డి) డిప్యూటీ సర్పంచ్ రవి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.ముఖ్య అతిథులుగా అమెజాన్ కంపెనీకి చెందిన తెలంగాణ జోనల్ మేనేజర్ తాతజీ సురేష్ హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామ అభివృద్ధికి దోహదపడే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

