Breaking News

ఎల్లారెడ్డిలో మానవీయ పాలనకు నిదర్శనం

పేదల పాలిట దేవుడిలా ఎమ్మెల్యే మదన్‌మోహన్

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పేదలు, విద్యార్థుల సంక్షేమానికి ఎమ్మెల్యే మదన్‌మోహన్ మరోసారి భరోసాగా నిలిచారు. తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన జంగం మమతకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సహాయంగా రూ.50,000 ఆర్థిక సాయాన్ని ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ అందజేశారు. అలాగే నగర్ మండలానికి చెందిన మధ్యల బాగయ్య కుమారుడి ఉన్నత చదువు కోసం రూ.25,000 విద్యా సహాయాన్ని అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించడం కష్టంగా మారిన కుటుంబానికి ఈ సాయం పెద్ద ఊరటగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ మాట్లాడుతూ, పేదలకు నివాసం, పిల్లలకు విద్య—ఇవే నిజమైన అభివృద్ధి సూచికలని, అవసరమైన చోట తన వంతు సహాయం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు.