Breaking News

వరుస చోరీల యువకుడు అరెస్ట్

మన ప్రగతి న్యూస్/జహీరాబాద్

జల్సాల కోసం కూలీ పనులు
మానేసి వరుసదొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని జహీరాబాద్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.11 లక్షల విలువైన 7 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకొని, అతడిని జుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సైదా తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్లతో కలిసి డీఎస్పీ సైదా వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్గోల్ క్రాస్ రోడ్ వద్ద మహిఫిల్ హోటల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. అనుమానం వచ్చి అతడిని పట్టుకొని విచారించగా, ఇటీవల పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిగా జహీరాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందినమహమ్మద్ ఇర్ఫాన్ పఠాన్ (18)గా గుర్తించామన్నారు.నిందితుడు రామ్నగర్, నాగులకట్ట తదితర కాలనీల్లో పగటిపూట ఇళ్లలో ఎవరూ లేని సమయంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు విరగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అతని వద్ద నుంచి వివిధ దొంగతనాల కేసులకు సంబంధించిన మొత్తం 7 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు నగల విలువ సుమారు రూ.11 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నిందితుడికి మద్యం, కల్లు, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు ఉన్నాయని, జల్సాలకు అలవాటు పడి దొంగతనాల వైపు మళ్లినట్లు తెలిపారు. జహీరాబాద్ తో పాటు బీదర్ తదితర ప్రాంతాల్లో కూడా ఇతనిపై దొంగతన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సైదా హెచ్చరించారు. ఈ కేసును జహీరాబాద్ టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ నమోదు చేసి నిందితుడిని జుడిషియల్ రిమాండ్కు పంపినటు తెలిపారు.
బంగారు నగల విలువ సుమారు రూ.11 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నిందితుడికి మద్యం, కల్లు, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు ఉన్నాయని, జల్సాలకు అలవాటు పడి దొంగతనాల వైపు మళ్లినట్లు తెలిపారు. జహీరాబాద్ తో పాటు బీదర్ తదితర ప్రాంతాల్లో కూడా ఇతనిపై దొంగతన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సైదా హెచ్చరించారు. ఈ కేసును జహీరాబాద్ టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ నమోదు చేసి నిందితుడిని జుడిషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. దొంగతన కేసును ఛేదించిన సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ తో పాటు ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ సైదా ఈ సందర్భంగా అభినందించారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు