మన ప్రగతి న్యూస్/నడికూడ:
హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం వసంత పంచమి పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు.. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లు ఎన్.అనిత, డి. సంపూర్ణ, డి.వినోద, ఆయాలు, పిల్ల ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

