మన ప్రగతి న్యూస్/వేములవాడ
వేములవాడలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇటీవల జరిగిన పలు చోరీల కేసులను ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి గురువారం వివరాలు వెల్లడించారు. వేములవాడ రూరల్ మండలంలోని పాజుల్‌నగర్, వట్టెం గ్రామాల్లో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో జరిగిన చోరీలతో పాటు పట్టణంలో నమోదైన ఇతర దొంగతనాల కేసుల్లో ఈ ఇద్దరు నిందితుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

