Breaking News

జాతర పనులను పర్యవేక్షించిన ఆర్డిఓ

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం :

శంకరపట్నం మండలం కేశవపట్నం తహాశీల్దార్ కార్యాలయంలో ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల పై గురువారం మండల రెవిన్యూ,పంచాయితీ అధికారులతో హుజరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం దేవాదాయ శాఖ ఈవో మారుతీ రావుతో కలిసి గద్దెల వద్ద అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఆయన,ముందుగా అమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.జాతర ప్రాంగణంలో భక్తుల కోసం చేపడుతున్న తాగునీరు,తాత్కాలిక స్నాన ఘట్టాలు,మరుగుదొడ్ల నిర్మాణం,విద్యుత్ సరఫరా పనుల పురోగతిని సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అధికారులను,జాతర కమిటీ సభ్యులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేఖ,ఎంపిడిఓ కృష్ణ ప్రసాద్, ఏపీవో శారద,జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి,ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయకుమర్,రెవెన్యూ,పంచాయతీ అధికారులు,జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు