మన ప్రగతి న్యూస్/ నల్గొండ మిర్యాలగూడ
పట్టణంలో రెడ్డి కాలనీ వాసులు తూముల నారాయణ విద్యుత్ శాఖ రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్ కూతురు శ్రీలత తల్లి సుగుణ ఏకైక పుత్రిక వాళ్ల కి ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పి.హెచ్.డి డాక్టరేట్ పట్టా బహుకరించారు వీళ్లు స్మార్ట్ సీడ్స్ సెలక్షన్ మరియు క్రాప్ ఈల్డ్ ఫ్రిడిక్షన్ అనే అంశం మీద కార్న్ షీడ్, మైజ్ షీడ్ మరియు ఇండియన్ ఇండియన్ ఈల్డ్ డేటా సెట్స్ ఆధారంగా మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ లో పరిశోధన సాగించి ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ పివి సుధా పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు, ఈ పరిశోధన వల్ల మన్నికైన సీడ్స్ ని ఆటోమేటిక్గా చేసుకొని తద్వారా రైతులు పంట దిగుబడిని పెంచుకోవడానికి రైతులకు, వ్యవసాయ నిపుణులకు ఉపయోగకరమైనది అని తెలిపారు. శ్రీలత తూముల వీళ్లు పదవ తరగతి, ఇంటర్, బ్యాచిలర్ ఆప్ కంప్యూటర్ అప్లికేషన్ టౌన్ ఫస్ట్ ర్యాంక్ లో పూర్తి చేశారు, నారాయణగూడ రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఎం.ఎస్.ఐ. ఎస్ జేఎన్టీయూ కూకట్పల్లి నుండి ఎం.టెక్ పట్టా సాధించి, రెడ్డి ఉమెన్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్స్ కాలేజీ, షాద్నగర్ లో లెక్చరర్ గాకొనసాగుతున్నారు. శ్రీలత సాధించిన విజయానికి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, నేతినూరి దామోదర్, 327 యూనియన్ రాష్ట్ర మాజీ నాయకులు గొడిశాల ముత్తయ్య, నేతి నూరి రిషీర, డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసచారి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కోడి రెక్క రవికుమార్, సబ్ ఇంజనీర్ సీతారామారావు, రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్ నామిరెడ్డి దయాకర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, బంధువులు తదితరులు అభినందించారు

