Breaking News

ఎస్సై సి పి ఆర్ చేసినా…దక్కని ప్రాణం

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:

దామెర పోలీస్ స్టేషన్ సమీపం లో శుక్రవారం దామెర కు చెందిన భాషబోయిన రాజాలు (58) పోలీస్ స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద కూర్చుని ఉన్నాడు.పక్కనే ఉన్న వారి తో మాట్లాడుకుంటూ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై కొంక అశోక్ కి సమాచారం అందించగా ఎస్సై చేరుకొని వెంటనే సిపీఆర్ చేశాడు. ప్రాణాన్ని నిలిపేందుకు తన శాయశక్తుల ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.వెంటనే 108 సిబ్బంది చేరుకొని అతన్ని పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.దీంతో ఎస్సై అశోక్ మృతదేహాన్ని తన స్వహస్తాలతో ట్రాక్టర్ లో వేసి అతని ఇంటికి చేర్చారు.ఈ సందర్భంగా స్థానికులు ఎస్సై అశోక్ ని అభినందించారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు