Breaking News

జిఎంకు మెమోరాండం సమర్పించిన ఎండి రజాక్

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, జిఎం ఆఫీస్ నందు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును కలిసి సింగరేణి సంస్థలొ మెడికల్ ఇన్వాల్డ్ అయిన 200 మంది పైచిలుకు ఉద్యోగుల పిల్లలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, అందులో కొత్తగూడెం ఏరియాలో సుమారు 30 మంది ఉద్యోగులు మెడికల్ ఇన్వాల్డ్ అయి ఉన్నారు, వీరికి త్వరగా ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని జీ.ఎం కు మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఈ యొక్క సమస్యను సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, వీరికి త్వరగా ఉద్యోగం లో చేరే విధంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సింగరేణి సంస్థలో పని చేసి రిటైర్డ్ అయిన కొంతమంది మాజీ ఉద్యోగులకు లాభాల బాట అలాగే పిఎల్ఆర్ బోనస్ త్వరగా ఇచ్చే విధంగా చూడాలని వారు ఎన్నో సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసే వారి రక్తాన్ని చెమటగా మార్చి ఎన్నో ఒడిదులుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థ మనుగడకు కాపాడడం కోసం ఉత్పత్తి ఉత్పాదకతలో వారి తోడ్పాటు ఎంతో ఉందన్నారు, అందుకు జి.ఎం సానుకూలంగా స్పందించి సింగరేణి సంస్థలో ఇన్వాల్వ్డ్ అయిన కార్మికుల పిల్లలకు పై అధికారులతో మాట్లాడి ఉద్యోగాలు త్వరగా వచ్చే విధంగా చూస్తానని తెలియజేయడం జరిగింది.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు