Breaking News

మార్కండేశ్వర స్వామికి భక్తితో లక్ష బిల్వార్చన

  • -బ్రహ్మోత్సవాల సందర్భంగా

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు మార్కండేశ్వరునికి భక్తి ప్రవత్తులతో లక్ష బిల్వార్చన పాండురంగ భజన మండలి సౌజన్యంతో నిర్వహింప బడింది. దేవాలయ 49వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందు ఉదయం శ్రీ శివ పం చాయతన యజ్ఞము చేశారు.అనంతరం నవగ్రహ పూజా కార్యక్రమం సిల్క్ యార్ న్ వర్తక సంఘంచే నిర్వహింపబడింది. సాయంత్రం నగరపాలక సంస్థ మాజీ చైర్మ న్ విజయలక్ష్మి శ్రీనివాస్ చే సహస్ర దీపారాధన ప్రారంభించబడింది. ఈ కార్యక్రమా ల్లో ఆలయ చైర్మన్ సీత సత్యనారాయణ, పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు రుద్ర పాండురంగ శాస్త్రి ,ఆలయ ఉపాధ్యక్షుడు భారత ఆంజనే యులు, ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి తో పాటు గుర్రం కృష్ణ ,ఈ .యాదగిరి, ఆలయ ధర్మకర్తలు ,భజన మండలి వారు, భక్తజనులు అధికంగా పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు