Breaking News

రామాలయం గుడి సందర్శన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ మాడుగుల్:

మాడుగుల మండలం సుద్దపల్లి గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న రామాలయం గుడిని గ్రామస్తుల కోరిక మేరకు సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచిసంకల్పంతో బృహత్తరమైన దైవ కార్యాన్ని చేపట్టినందుకు గ్రామస్తులందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మికతను,దైవసంకల్పాన్ని , భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి ఆధ్యాత్మికనిర్మాణాలు చరిత్రలో నిలిచివుంటాయని తెలిపారు. ఇంతటి దైవ కార్యంలో తప్పనిసరిగా భాగస్వామినై నా వంతుగా సహకారమందిస్తానని హమీ ఇచ్చారు.ఈ సందర్భంగా పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చి మా గుడిని సందర్శించిన రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపి , శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గజ్జ స్వాతి సత్యం గౌడ్, ఉప సర్పంచ్ దేవరకొండ శ్రీను, సీనియర్ నాయకులు గ్యార నర్సింహ, దేవరకొండ శ్రీను, కొప్పుల డౌలయ్య, మారోజు జగన్ చారి , మాజీ ఉప సర్పంచ్ కొప్పుల శేఖర్ గౌడ్ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు