Breaking News

గ్రామ పంచాయతీ వేదికగా బెల్ట్‌ షాపునకు వేలం..!!

  • బెల్ట్ షాప్ 8.5 లక్షలు
  • చికెన్ షాప్ 1.5లక్షలు
  • గ్రామ అభివృద్ధి మరియు దుర్గమ్మ పండుగ కోసం వేలం
  • అంగీకరించని మహిళలు

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

గ్రామంలో బెల్ట్‌ షాపు నడపడానికి ఏకంగా గ్రామపంచాయతీ వేదికగా వేలం పాట నిర్వహించారు. ఈ సంఘటన రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామం లో జరిగింది. వివరాలలోకి వెళితే గ్రామంలో దుర్గమ్మ పండుగ మరియు గ్రామ అభివృద్ధి కోసం అని ఏకంగా గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ వేదికగా వేలం వేశారు. దీనికి గాను 14 మంది వేలం పాటలో పాల్గొన్నారు. 8.50 లక్షలకు ఒకరు ముందుకు వచ్చి పాటలో బెల్ట్ షాప్ దక్కించుకున్నారు. అలాగే చికెన్ షాప్ కు వేలం వేసి 1.50లక్షలకు ఒకరు పొందడం జరిగింది. ఇట్టి 10 లక్షలు రూపాయలు గ్రామ అభివృద్ధికి మరియు మార్చి నెలలో జరిగే దుర్గమ్మ పండుగ గురించి వినియోగించు కోవాలని గ్రామ పెద్దలు నిర్ణయం చేశారు. దీన్ని గ్రామంలో ఉన్న మహిళలు బెల్ట్ షాప్ వేలాన్ని అంగీకరించలేదు. బెల్ట్ షాప్ వల్ల మహిళల భర్తలు మరియు వారి పిల్లలు మద్యానికి బానిస అయి అనారోగ్యంనకు గురి అవుతారని బెల్ట్ షాప్ వద్దని వాపోయారు.పక్కన ఉన్న ఇబ్రహీంపూర్ గ్రామంలో గత 7సంవత్సరాలనుండి మధ్య పాన నిషేధం అమలులో ఉన్నదని.. ఫతేషాపూర్ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ వద్దని మహిళలు అంగీకరించలేదు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు