Breaking News

వాహన తనిఖీల్లో పట్టుబడిన 39 మైనర్లకు సామాజిక సేవ, తల్లిదండ్రులకు భారీ జరిమానా

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ :

లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39 మైనర్లపై ఛార్జ్‌షీట్ నమోదు చేసి, నేడు వాళ్ల ని కోర్టులో హాజరుపరుచగా, కేసును విచారించిన మెజిస్ట్రేట్ నిబంధనలు ఉల్లంఘించిన 39 మైనర్లకు వినూత్న శిక్షను విధించారు. రేపు (మరుసటి రోజు) సిద్దిపేటలోని కోమటి చెరువు పరిసరాల్లో మొక్కలు నాటాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు గాను, తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున భారీ జరిమానా విధించారు.ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని తల్లిదండ్రులను సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు