మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్-1 డిపోలో శంకరపట్నం మండలం నల్లవెంకయ్యపల్లి సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ బేడిగ మహేశ్వర్ విధులు నిర్వర్తిస్తూన్నారు.జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో ప్రమాద రహిత డ్రైవర్ గా మొదటి స్థానంలో నిలిచారు.కరీంనగర్ సిపి గౌస్ ఆలాం,కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు శాలువాతో సన్మానించి,ప్రశంస పత్రం అందించారు.విధుల పట్ల నిబద్ధతతో పనిచేయడంతో మహేశ్వర్ సేవలు అభినందనీయమని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

