ఏన్కూరు మండల అధ్యక్షుడు పొట్లంపల్లి శ్రీనివాసరావు
మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ :
తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం ఉభయ జిల్లాల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన జిల్లా 24వ గ్రామీణ వైద్యుల మహాసభ ఘనంగా ముగిసింది. ఈ మహాసభకు సంఘ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై ఈ మహాసభలో విస్తృతంగా చర్చించారు. గ్రామీణ వైద్యుల హక్కుల పరిరక్షణకు సంఘం చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఏన్కూరు మండల గ్రామీణ వైద్యుల అధ్యక్షుడు పొట్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని, మండల స్థాయిలో గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.మహాసభలో సంఘ ప్రధాన కార్యదర్శి జి. మధు, లేళ్ల నరసింహారావు, ఎస్. రామారావు,రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేశారు.


