చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:
గాంధారి మండలంలోని మొండి నడక్ గ్రామంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ వరిధిలో నర్సాపూర్, మొండి నడక్ గ్రామాలు ఉండగా ప్రతి ఏటా మొండి నడక్ గ్రామ వందాయతీ వద్దనే అన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తారని పలువురు గ్రామస్తులు తెలిపారు. అయితే సోమవారం జనవరి 26 రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా ఇక్కడ గ్రామ పంచాయతీ వద్ద ఎగుర వేయాల్సిన జెండాను ఆలస్యంగా అంటే సుమారు వది తరువాతనే ఎగుర వేయడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై నర్పంచి సాయిలు మాట్లాడుతూ తనకు అనారోగ్యం వల్లనే జెండా ఎగుర వేయలేదని, ఈ విషయం అధికారులకు చెప్పానన్నారు. ఈ విషయమై వంచాయతీ కార్యదర్శిని అడుగగా సర్పంచికి అనారోగ్యం ఉందని, అందుకే మేము జెండాను ఎగుర వేశామన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆపరిశుభ్రంగా ఉండని, జెండాను వది తరువాతనే నామ మాత్రంగా నలుగురు, ఐదుగురి ఉండి ఎగుర వేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయమై పలువురు గ్రామస్తులు మట్లాడుతూ మొండి నడక్, నర్సాపూర్ గ్రామాలు రెండు ఉండగా మొన్నటి వంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి సర్పంచిగా గెలిచారు. దీంతో గ్రామ పంచాయతీని తమ గ్రామంలో పెట్టుకుందామనే ఉద్దేశ్యంతో జాతీయ జెండాను నర్సాపూర్లో సర్పంచి ఎగుర వేశారని, ఇక్కడికి రావడానికి మాత్రం జ్వరం అనే తప్పుగా చెప్పారని, జెండావిషయంలో ఇలా ప్రవర్తించిన అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మొండి నడక్ గ్రామ ప్రజలు వలువురు డిమాండ్ చేశారు. ఏది ఏమైనా గ్రామ సమస్యలను కూర్చొని మాట్లాడుకొనే దానికి జాతీయ జెండా విషయంలో వంగాలకు పోవడం ఏమిటని పలువురు విద్యావంతులు వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు.


